మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ సరస్వతి ముస నరేందర్‌ను డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. మూస నరేందర్ తల్లి మూస బాలమ్మ నిన్న మృతి చెందారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ మేయర్ మృతురాలి చిత్రపటానికి నివాళులర్పించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.