HYDలో మూసీ నది అభివృద్ధిపై ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. ఉస్మాన్‌సాగర్ నుంచి వచ్చే జలాలు కలుషితం కాకుండా పరిరక్షించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. మూసీ ప్రవాహ ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందించింది. నది పరివాహక ప్రాంతాల్లో మురుగు ప్రవాహాన్ని అడ్డుకునేలా అనేక చోట్ల రిటైనింగ్ వాల్స్ నిర్మాణం చేపట్టనుంది.