ATP: ఎల్లనూరు మండలం జంగంపల్లి గ్రామంలో నేడు సినీ నటుడు విజయ్ దేవరకొండ పర్యటించనున్నారు. ఆయన నటిస్తున్న ‘రణబలి’ చిత్ర షూటింగ్ జంగంపల్లి కోట వద్ద నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ నేపథ్యంలో షూటింగ్ కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.