KMM: తల్లాడలో సివిల్ సప్లై అధికారులు శనివారం మెరుపు దాడులు నిర్వహించి, హోటళ్లలో గృహావసరాల కోసం వినియోగిస్తున్న 8 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా గ్యాస్ వాడుతున్న హోటల్ యజమానులపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి చందన్ కుమార్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.