TG: విధి నిర్వహణలో చనిపోయిన విద్యుత్ ఉద్యోగులకు.. రూ.కోటి చొప్పున చెక్కులను సీఎం రేవంత్ రెడ్డి పంపిణీ చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10లక్షలకు పెంచామన్నారు. సీపెక్ సర్వే ప్రకారం కుటుంబాలకు రూ. 5లక్షల బీమా, విద్యుత్, సింగరేణి కార్మికులకు రూ.కోటి ప్రమాద బీమా ఇస్తున్నామన్నారు. ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో మనోధైర్యం నింపేందుకే.. అసెంబ్లీ సమయంలో చెక్కులు ఇస్తున్నామన్నారు.