TG: రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీసీ సీఎం అవుతారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అది కాంగ్రెస్తోనే సాధ్యమని స్పష్టం చేశారు. బీసీని సీఎం చేస్తామని చెప్పే దమ్ము బీజేపీకి ఉందా? అని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్ బీసీని సీఎం చేస్తామని చెప్పగలరా? అని నిలదీశారు. బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీ అని 42శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును అడ్డుకుంటోందన్నారు.