BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి వివాహ మహోత్సవానికి (శ్రీరామనవమి) దగ్గర పడటంతో అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈనెల 26న ఎదురుకోళ్ల ఉత్సవం, 27న రామయ్య కళ్యాణం, 28న పట్టాభిషేకం వంటి మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు సాంప్రదాయబద్ధంగా పనులు ప్రారంభించారు. పురవీధులు సుందరంగా ముస్తాబయ్యాయి.