JN: పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో రఘునాథపల్లి మండలంలోని పలు పరీక్షా కేంద్రాలలో పరీక్షల సరళిని ఇవాళ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు. సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ లను సంబంధిత వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్‌తో లోపలికి ఎవ్వరినీ అనుమతించవద్దని స్పష్టం చేశారు.