నాగర్ కర్నూల్ పట్టణంలోని శ్రీపూర్ రోడ్లో అంధకారం నెలకొంది. పలుచోట్ల వీధి దీపాలు పనిచేయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీని వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు వాపోయారు. వాహనాదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. అధికారులు స్పందించి వీధి దీపాలకు మరమ్మతులు చేయాలని కోరారు.