VZM: శృంగవరపుకోట ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశాన్ని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక వసతుల కల్పనపై సుదీర్ఘంగా చర్చించారు. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే ఈ సందర్భంగా స్పష్టం చేశారు.