NRML: మాడిఫైడ్ సైలెన్సర్లతో శబ్ద కాలుష్యం కలిగిస్తున్న వాహనాలపై పోలీసులు సోమవారం ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను స్వాధీనం చేసుకుని, వాహనదారులపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. ప్రజల ప్రశాంతతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డా.జి.జానకీ షర్మిల హెచ్చరించారు.