మార్కాపురం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు సోమవారం పొదిలి పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న హత్యలు, మహిళలపై నేరాల కేసులను సమీక్షించి, శాస్త్రీయ పద్ధతుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించారు. విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ పెంచి అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేయాలని, ప్రజలకు భద్రతా భావం కల్పించాలని అధికారులకు సూచించారు.