పవన్ కళ్యాణ్ తదుపరి ప్రాజెక్టుల గురించి ఆయన బృందం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం పవన్ పూర్తిస్థాయిలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో నిమగ్నమై ఉన్నారని చెప్పింది. ఆయన ఎలాంటి కొత్త సినిమాలకు సంతకం చేయలేదని స్పష్టం చేసింది. ‘OG 2’ సీక్వెల్ గురించి వస్తున్న వార్తలను నమ్మవద్దని కోరింది. దీంతో ఇతర దర్శకులతో పవన్ చర్చలు జరుపుతున్నారనే రూమర్లకు ఈ ప్రకటనతో తెరపడింది.