ప్రకాశం: ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం HP పెట్రోల్ బంక్ వద్ద ఇవ్వల రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో కింద పడిపోయాడు. ప్రమాదాన్ని గమనించని డ్రైవర్ బస్సును ఆ వ్యక్తి తలపై నుంచి పోనివ్వడంతో అతను మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.