అన్నమయ్య: కె.వి.పల్లి మండలం సొరకాయలపేట గ్రామం వద్ద పేకాట ఆడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్సై బి. వెంకట శివకుమార్ తెలిపారు. పక్కా సమాచారంతో పేకాట శిబిరంపై దాడి చేసి అరెస్ట్ చేశామన్నారు. వారి నుంచి రూ. 7,500 నగదు, 4 బైకులు, 3 సెల్ ఫోన్లు, 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.