కొత్త కారు కొనేవారికి తయారీ కంపెనీలు షాక్ ఇస్తున్నాయి. పశ్చిమాసియాలో ముదిరిన ఉద్రిక్తతల కారణంగా ముడి పదార్థాల ధరలు విపరీతంగా పెరగడంతో, అనేక కార్ల తయారీ సంస్థలు కార్ల ధరలను పెంచాయి. వీటిలో దేశీయ తయారీ దిగ్గజం టాటా మోటార్స్‌తో పాటు లగ్జరీ కార్ల బ్రాండ్ బీఎండబ్ల్యు, మెర్సిడెస్ బెంజ్, ఆడి ఇండియా కూడా ఉన్నాయి. మారుతీ సుజుకి కూడా పెంపును సమీక్షిస్తున్నట్టు సమాచారం.