TG: ప్రజలు రవాణా శాఖ సేవలను ఆన్ లైన్ ద్వారా పొందే అవకాశం కల్పించి డిజిటల్ విప్లవాన్ని తీసుకువచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. జాతీయ స్థాయి ‘వాహన్’ పోర్టల్‌ను మంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలో రెండో, తదుపరి వ్యక్తిగత వాహనాల కొనుగోలుపై ఉన్న 2 శాతం అదనపు జీవితకాల పన్నును రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.