AP: సీఎం చంద్రబాబు, Dy. CM పవన్ నాయకత్వం బాగుందని కేంద్రమంత్రి కుమారస్వామి అన్నారు. పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా ఏపీని మార్చారని ప్రశంసించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కుదుటపడేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించిందని వెల్లడించారు. జాతీయ ఉక్కు వినియోగ విధానాన్ని అనుసరించి ఉక్కు ఉత్పాదన పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.