SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వరాలయంలో శుక్రవారం భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు కావడంతో వేలది మంది భక్తులు తరలివచ్చి భీమేశ్వర స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఉదయం నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కును చెల్లించుకుంటున్నారు.