AKP: రాంబిల్లి మండలం భోగాపురం గ్రామానికి చెందిన వివాహిత పక్కుర్తి కుమారి (43)పాముకాటుతో మృతి చెందింది. కూలి పనికి వెళుతుండగా సోమవారం విషపూరితమైన పాము కాటు వేసింది. ఆమె భర్త కొండబాబు ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స చేసి అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి పంపించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.