ATP: ఆర్డీటీ సంస్థకు FCRA పునరుద్ధరణ సాధ్యం కావడంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ కృషి మరువలేనిదని సంస్థ డైరెక్టర్ మాంచో ఫెర్రర్ కొనియాడారు. బుధవారం తన నివాసంలో మంత్రిని కలిసిన ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మంత్రి పలుమార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంశాఖతో సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరించారని పేర్కొన్నారు.