నెల్లూరు జిల్లాలో పోలీసు వ్యవస్థ పనితీరుపై మాజీ మంత్రి కాకాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధాకృష్ణ నాయుడు వంటి వారిని, అమాయక విద్యార్థులను పబ్లిసిటీ కోసం నేరస్తులుగా చిత్రీకరిస్తూ వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్. నాయుడు, కోనేటి ఆదిమూలం వంటి వారి విషయంలో మౌనంగా ఉంటూ, కేవలం సామాన్యులను వేధించడం సరికాదని హితవు పలికారు.