విశాఖలోని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. సాయి కృష్ణ బార్ సమీపంలో ముగ్గురు యువకులు ఓ వృద్ధుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. దాడికి గల కారణాలు, నిందితుల వివరాల కోసం సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.