GNTR: ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సహా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.