PPM: నకిలీ మొక్కజొన్న విత్తనాలు సరఫరా చేసి రైతులు మోసగించిన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బంటు దాసు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం పార్వతీపురంలో ధర్నా నిర్వహించారు. ఎకరాకు 4 టన్నులు దిగుబడి రావాల్సి ఉండగా ఒక టన్ను మాత్రమే దిగుబడి వచ్చి రైతులు లక్షలాది రూపాయలు నష్టపోయారన్నారు. రైతులకు కంపెనీలు నష్ట పరిహారం చెల్లించాలని కోరారు.