SRD: సదాశివపేట పోలీసులు భారీ మొత్తంలో సోమవారం గంజాయిని పట్టుకున్నారు. సదాశివపేట బైపాస్ రోడ్డు నుంచి సంగారెడ్డికి వెళ్తున్న వాహనంలో 287 గంజాయి ప్యాకెట్లను సీఐ వెంకటేశం ఆధ్వర్యంలో స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 2.87 కోట్ల విలువ ఉంటుందని తెలిపారు. పింకు, పప్పు, నారాయణ ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.