టాలీవుడ్ నటుడు సుహాస్ హీరోగా దర్శకుడు గోపి అచ్చెర తెరకెక్కించిన ‘హే బల్వంత్’ మూవీ మిశ్రమ స్పందన తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా OTTలోకి వచ్చేందుకు సిద్ధమైంది. దీని డిజిటల్ రైట్స్‌ను జీ5 సొంతం చేసుకోగా.. మార్చి 31 నుంచి సదరు OTTలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. తన తండ్రి వ్యాపారాన్ని వారసత్వంగా తీసుకోవాలనుకునే యువకుడి కథతో ఈ సినిమా రూపొందింది.