KMM: ప్రజావాణిలో పలు సమస్యలపై ఇచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి. శ్రీజ అన్నారు. ఇవాళ ఖమ్మం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో ఆమె వినతులు స్వీకరించారు. ప్రజలు ఎంతో నమ్మకంతో ప్రజావాణికి వస్తుంటారని, వారి సమస్యలపై స్పందించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.