NRPT: నారాయణపేట శివారులో నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ భవన సముదాయాలను సోమవారం కలెక్టర్ ప్రతీక్ జైన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారి నుంచి కలెక్టరేట్ వరకు రోడ్డు సమాంతరంగా నిర్మించాలన్నారు. అలాగే ట్రాన్స్ఫార్మర్ను తరలించాలని, భవనం చుట్టూ మొక్కలు నాటాలని ఆయన అధికారులకు ఆదేశించారు. పనుల్లో వేగం పెంచాలన్నారు.