NRPT: మరికల్ మండల కేంద్రంలో ఈనెల 28న తై బజార్ బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు పంచాయతీ అధికారులు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు 27వ తేదీన రూ.50,000 డిపాజిట్ చెల్లించి రశీదు పొందాలని, పాత బకాయిలు ఉన్నవారికి వేలంలో ప్రవేశం ఉండదని స్పష్టం చేశారు. ఈ వేలం స్థానిక పంచాయతీ కార్యాలయ ఆవరణలో జరుగుతుందన్నారు.