MDK: జిల్లాలో యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలుకు పకడ్బందీగా సన్నాహాలు చేయాలని అధికారులను కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. ఏప్రిల్ 15 నుంచి జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.