NLG: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ ‘గ్రీవెన్స్ డే’ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 35 మంది తమ వ్యక్తిగత, ఆర్థిక, భూ సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. ఫిర్యాదులను విన్న ఎస్పీ, వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు పోలీస్ శాఖ అండగా ఉంటుందని, ఎలాంటి సమస్యకైనా నేరుగా నిర్భయంగా తమను సంప్రదించాలని ఎస్పీ భరోసా ఇచ్చారు.