GDWL: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పెన్షన్ వ్యతిరేక బిల్లు విశ్రాంత ఉద్యోగుల జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తోంది అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ నేతలు లక్ష్మి రెడ్డి, చక్రధర్ పేర్కొన్నారు. సోమవారం గద్వాలలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఈ నూతన బిల్లు వల్ల పెన్షనర్లకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతుందన్నారు.