KMM: గత ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తుపై అధికారులు స్పందించి, మానవీయ కోణంలో చర్యలు చేపట్టారని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. తల్లాడ మండలానికి చెందిన రమేష్, సులోచన దంపతులకు సొంత ఇల్లు లేని కారణంగా ఇబ్బంది పడుతున్నట్లు సోమవారం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. సత్వరంగా స్పందించిన కలెక్టర్ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలన్నారు.