అన్నమయ్య: పీలేరు మండలం బోడుమల్లువారి పల్లి పంచాయతీలో “అన్నదాత సుఖీభవ”, “పీఎం కిసాన్” లబ్ధిదారులతో సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పురం రామ్మూర్తి, డైరెక్టర్లు రవి, కిషోర్, క్లస్టర్ ఇంఛార్జ్ వెంకటరత్నం, ఐటీ టీడీపీ ప్రతినిధి వెంకటరమణారెడ్డి, అగ్రికల్చర్ అసిస్టెంట్ హిమబిందు తదితరులు హాజరయ్యారు.