మార్కాపురం జిల్లా నూతన పోలీస్ కార్యాలయ నిర్మాణానికి స్థల ఎంపికలో భాగంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సోమవారం రాయవరం సమీపంలోని ప్రభుత్వ భూమిని పరిశీలించారు. భూమి అనుకూలత, రవాణా సౌకర్యాలు, భద్రతా అంశాలపై అధికారులతో చర్చించారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు ఈ కార్యాలయం ఉపయోగపడుతుందని తెలిపారు.