SRD: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం వ్యవసాయ, ఉద్యానవన, డీఆర్డీఏ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన ఫార్మ్ మెకనైజేషన్ లక్ష్యాలను వేగంగా సాధించడంతో పాటు తేనెటీగల పెంపకం కార్యక్రమాన్ని విస్తరించాలన్నారు. అలాగే ఎక్కువ మంది రైతులకు బీహైవ్ యూనిట్లు అందజేయాలన్నారు.