AP: పోలవరంపై ఎంపీ మిథున్ రెడ్డి పార్లమెంట్లో మాట్లాడారు. ‘పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించొద్దు. కేంద్ర బడ్జెట్ ఎత్తు 41.15 మీటర్లుగా నిర్ణయించారు.. వాస్తవానికి పోలవరం ఎత్తు 45.72 మీటర్లు ఉండాలి. నిర్మాణానికి రూ.55 వేల కోట్లు కేటాయించాలి. పోలవరం నిల్వ సామర్థ్యం తగ్గించడం అంటే.. ఏపీ అన్యాయం చేయడమే’ అని పేర్కొన్నారు.