AP: మాజీ సీఎం జగన్తో ఆస్తుల వివాదంపై PCC చీఫ్ షర్మిల స్పందించారు. ‘జగన్ ఆస్తులపై నాకు ప్రేమ లేదు. నా పోరాటం ఆస్తుల కోసం కాదు. అందుకే MOU పేపర్లను నేను ఇప్పటి వరకు బయట పెట్టలేదు. అమ్మపై కేసులు వేసి షేర్లు వెనక్కి ఇవ్వాలని కోర్టుకు వెళ్లారు. అమ్మ విడుదల చేసిన లేఖ నిజమని జగన్కు తెలుసు. ఆ అంశంపై మాట్లాడే దమ్ము జగన్కు లేదా?’ అని ప్రశ్నించారు.