NTR : అకాల వర్షాలతో దెబ్బతిన్న నందిగామ మండలం రామిరెడ్డిపల్లి పంట పొలాలను YCP ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు సోమవారం పరిశీలించారు. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఎకరానికి రూ.50 వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మార్క్ఫెడ్ ద్వారా క్వింటాల్ మొక్కజొన్నను రూ.2400 మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, లేనిపక్షంలో రైతు ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.