VZM: కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS), రెవెన్యూ క్లినిక్కు ప్రజల నుండి మంచి స్పందన లభించింది. మొత్తం 202 వినతులు అందగా, వాటిలో అధికంగా 93 రెవెన్యూ శాఖకు చెందినవే ఉన్నాయి. వినతుల పరిష్కారంలో ఆలస్యం సహించబోమని, పెండింగ్ కేసులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.