GDWL: గట్టు ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని భీమ్ ఆర్మీ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మాచర్ల ప్రకాశ్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషాకు 25 ప్రజా సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టి పేదలకు ఉచిత విద్యను అందించాలని కూడా ఆయన కోరారు.