మెగా హీరో సాయి దుర్గా తేజ్ ప్రధాన పాత్రలో రోహిత్ KP తెరకెక్కిస్తోన్న మూవీ ‘సంబరాల యేటిగట్టు’. ఈ సినిమాలో శ్రీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇవాళ శ్రీకాంత్ బర్త్ డే సందర్భంగా మేకర్స్.. అతనికి విషెస్ చెబుతూ ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేశారు. ఇందులో శ్రీకాంత్.. బ్రిటిష్ యూనిఫామ్‌లో గుబురు గడ్డంతో గుర్తుపట్టలేని విధంగా కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ SMలో వైరలవుతుంది.