AP: తిరుమల శ్రీవారిని దర్శించుకొవాలనుకునే భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్ జారీ చేసింది. జూన్ లో స్వామివారిని దర్శించుకోవాలనుకునే వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న భక్తులకు ఉచిత ప్రత్యేక దర్శన కోటా టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసింది. ఈ టికెట్లు బుక్ చేసుకోవాలనుకునే భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలి.