ప్రకాశం: టంగుటూరులోని నిర్మల ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ గోడౌన్ను జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి మంగళవారం ఆకస్మికతనికి నిర్వహించారు. గ్యాస్ సిలిండర్ల వివరాలను, స్టాక్ రిజిస్టర్ డైలీ సేల్స్ రిజిస్టర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. గృహ అవసరాలకు సంబంధించిన వంట గ్యాస్ కోరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.