JGL: రాయికల్ మండలం తాట్లవాయి గ్రామ పరిధిలో ఉన్న అటవీ ప్రాంతంలోని గుట్టపై గల రామాలయంలో శుక్రవారం స్వామి వారి రథోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సీతారాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన రథంపై ఉంచి భక్తులు రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ రథోత్సవాన్ని తిలకించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.