SKLM: సారవకోట మండలం బుడితి జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి పరీక్షలు పూర్తి చేసిన విద్యార్థులకు పాలిటెక్నిక్, ఏపీఆర్జేసీ ప్రవేశ పరీక్షల కొరకు ఇవాళ ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి మడ్డు వెంకటరమణ పాల్గొని విద్యార్థులు ఈ అవకాశాన్ని అందుపుచ్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రాము ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.