కృష్ణా: ‘అన్నదాత-సుఖీభవ’ పథకం కింద నిధులను ఇవాళ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గన్నవరం మండలంలో పర్యటించనున్నారు. సూరంపల్లిలో జరిగే కార్యక్రమంలో సీఎం నిధులను విడుదల చేసి, రైతు సోదరులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం ప్రజావేదికలో రైతు సంక్షేమంపై ప్రభుత్వ చర్యలను వివరించనున్నారు.