అన్నమయ్య: 12వ పీఆర్సీ కమిషన్ ఛైర్మన్‌ను వెంటనే నియమించి, 29% ఐఆర్ ప్రకటించాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షేక్ జాబీర్ కోరారు. ఈ మేరకు రాయచోటి తహసీల్దార్ కార్యాలయం అంబేద్కర్ విగ్రహం వద్ద మార్చి 24న ఒక రోజు నిరాహార దీక్ష చేస్తామని చెప్పారు. పెండింగ్ డీఏలు విడుదల, సీపిఎస్ రద్దు, బకాయిల చెల్లింపులకు రోడ్ మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.