MNCL: బెల్లంపల్లి మున్సిపాలిటీ 26వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాషా ఇటీవల గుండెపోటుతో మరణించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఇవాళ వారి స్వగృహానికి వెళ్లి పాషా కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసి, పాషా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.